చౌటుప్పల్ : ఎన్ హెచ్ 65 పై ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
చౌటుప్పల్ : ఎన్ హెచ్ 65 పై ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
చౌటుప్పల్. మన సాక్షి.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 23వ తేదీన 65వ నెంబర్ జాతీయ రహదారిపై హైవే 9హోటల్ వద్ద రాత్రి సుమారు 9:30గంటలకు శ్రీని కంపెనీ వైపు వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు.
స్థానికులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించడంతో పోలీసులు వెళ్లి అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్య చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించారని పోలీసులు తెలిపారు. పోలీస్ పెట్రోల్ మొబైల్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హెచ్ సి 1414 బి సూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు
ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.
మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురిలో మృతదేహాన్ని భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు మిత్రులు మృతదేహాన్ని గుర్తిస్తే 9940795612 కు సంప్రదించాలని ఎస్సై ప్రభాకర్ పత్రికకు ఇచ్చిన ప్రకటన ద్వారా కోరారు.









