Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

వలిగొండ : వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిక

వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిక

వలిగొండ, మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని గోపరాజుపల్లి గ్రామంలో వివిధ పార్టీల నుండి భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పదిహేను మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి గోపరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.

 

ఈ చేరికలలో భాగంగా సి.పి.ఎం పార్టీ నుండి మాజీ ఉప సర్పంచ్ సంగపాక బిక్షపతి సoగపాక నవీన్ సలిగంజి ఎల్లయ్య సి.పి.ఐ నుండి వల్లపు లింగయ్య కాంగ్రెస్ నుండి మోత్కూరు శ్రీరాములు రుద్రపెళ్లి పెద్ద ముత్తయ్య రుద్రపెళ్ళి మచ్చగిరి(చిన్న) కేతం యాదయ్య కేతo వెంకటేష్ బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు .

 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కీసర్ల ఉపేంద్ర సత్తిరెడ్డి వేములకొండ గుట్ట ధర్మకర్త పాశం మహేందర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు పోలేపల్లి రమేష్ గ్రామ శాఖ ఉప అధ్యక్షుడు మేడి పరమేశ్ వార్డు మెంబర్ చిల్లర్ స్వామి సంగిశేట్టి చంద్రయ్య సహాయ కార్యదర్శి కట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు