Breaking NewsTOP STORIESఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయం
ఖమ్మం : వైయస్ షర్మిల పర్యటనలో అపశృతి, కింద పడిపోయిన షర్మిల (వీడియో)
ఖమ్మం : వైయస్ షర్మిల పర్యటనలో అపశృతి, కింద పడిపోయిన షర్మిల (వీడియో)
ఖమ్మం, మనసాక్షి :
ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అపశృతి చోటు చేసుకుంది. ఆమె మీడియాతో మాట్లాడుతుండగా కింద పడిపోయిందివ ఈ సంఘటనతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గం కొణిజర్ల మండలంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని వైఎస్ షర్మిల పరిశీలించారు . మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురైన షర్మిల పొలంలోనే కింద పడిపోయారు.
ఆమె మీడియాతో మాట్లాడిన కామెంట్స్ యధావిధిగా:
-
ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మం రైతులు దారుణంగా నష్టపోయారు.
-
అకాల వర్షాలకు చేతికొచ్చిన మొక్క జొన్న పంట నేల పాలయ్యింది.
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
-
గత నెల ఇదే ఖమ్మం జిల్లాకి కేసీఅర్ వచ్చాడు.
-
మొక్క జొన్న పంటను పరిశీలించి 10 వేలు ఇస్తా అని ప్రకటన చేశాడు.
-
గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పాడు.
-
ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదువ
-
పెద్ద పెద్ద భవంతులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి.
-
పంట నష్టపోయిన రైతులకు ఇవ్వడానికి రూపాయి కూడా ఉండదు.
-
2.50 లక్షల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు లక్షా 50 వేల ఎకరాలు అన్నారు..అది కూడా లేదు.
-
బోడి 5 వేలు రైతు బందు ఎవడు అడిగాడు. 30 నుంచి 50 వేలు పెట్టుబడి పడితే నష్టపోయారు. 5 వేలు ఏ మూలకు సరిపోతాయి.
-
ఇదేనా కేసీఅర్ పాలన
-
రాష్ట్రంలో ఇప్పటి వరకు 9.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది.
-
కనీసం ఒక్క ఎకరాకు పరిహారం ఇవ్వలేదు.
-
నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వెంటనే ఇవ్వాలి
షర్మిల కింద పడిపోయిన వీడియో 👇
మీడియాతో మాట్లాడుతున్న కింద పడిపోయిన షర్మిల pic.twitter.com/9E0NBbnGPT
— Mana Sakshi (@ManaSakshiNews) April 30, 2023









