రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అనంతగిరి, మన సాక్షి :
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతగిరి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది అనంతగిరి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..
తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన ఎలక నాగరాజుమోటార్ సైకిల్ పై కోదాడ నుండి తమ్మరబండపాలెం వెళ్తుండగా మార్గమధ్యలో రాజరాజేశ్వరి రైస్ మిల్ వద్ద వచ్చేసరికి అతనికి ముందుగా వెళుతున్న కారు ను డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ఒకేసారి అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దాని వెనకాల మోటార్ సైకిల్ పై వెళుతున్న నాగరాజు కారు వెనకాల మోటార్ సైకిల్ తగిలి కింద పడ్డాడు.
అదే సమయంలో ఖమ్మం వైపు నుండి కోదాడ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ ని డ్రైవర్ టిప్పర్ ను అతివేగంగా అతివేగంగా నడుపుతూ నాగరాజు కాళ్ళ మీది నుండి వెళ్ళగా నాగరాజు రెండు కాళ్లు నూజ్జు నూజ్జు అయ్యాయి. వెంటనే అతన్ని 108 అంబులెన్స్ లో కోదాడ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు సీరియస్ గా ఉన్నదని అని చెప్పగా వెంటనే సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు మరణించినాడు.
మృతుడి అన్న ఎలక సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కారు డ్రైవరు పై, టిప్పర్ డ్రైవరు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది.









