హనుమాన్ జయంతి కరపత్రాల ఆవిష్కరణ
హనుమాన్ జయంతి కరపత్రాల ఆవిష్కరణ
వేములపల్లి, మన సాక్షి:
ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించుకోవాలని రావులపెంట గ్రామ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం గ్రామ ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన ఆదివారం రోజున గ్రామంలో పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు జరగబోయే హనుమాన్ జయంతిలో గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిండి సతీష్ రెడ్డి, ఆలయ పూజారి పద్మనాభ శర్మ, గ్రామ పెద్దలు నాగేశ్వరరావు, తంగేళ్ల రవి, మద్దుల రవి, యువకులు పొడిసెట్టి లింగస్వామి, సైదులు,పురాణం సైదులు, శీలం లింగస్వామి, శీలం సతీష్, సుమన్, ధరణికోట నాగరాజు, జర్నలిస్టు వినయ్ గౌడ్, చల్ల సతీష్,చంద్రకళ,సందీప్, గౌతమ్ రెడ్డి,శివ రెడ్డి,పిట్టల నాగరాజు,పిట్టల జని,శీలం వెంకటయ్య, చిట్యాల పవన్, పుట్ట సైదులు తదితరులు పాల్గొన్నారు…….









