Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
బిగ్ బ్రేకింగ్ : నీటి గుంటలో పడి బాలుడు మృతి
బిగ్ బ్రేకింగ్ : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హైదరాబాద్ : మనసాక్షి
నీటి గుంటలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఆరేళ్ల బాలుడు వివేక్ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ వర్షపు నీటి కుంటలో పడి మృతి చెందాడు.
బాలుడి తండ్రి తల్లిదండ్రులు కాకినాడకు చెందినవారు. బతుకుతెరువు కోసం హైదరాబాదులో వచ్చి నివసిస్తున్నారు. బాలుడి తండ్రి జూబ్లీహిల్స్ లో ఓ కంపెనీలో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. తమ ఆరే ళ్ల బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుగా ఏడ్చుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.









