పినపాక : పోలీసుల అలర్ట్.. అందుకోసమేనా..?
పినపాక : పోలీసుల అలర్ట్.. అందుకోసమేనా..?
పినపాక. మన సాక్షి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీలు చేయడంతో పాటు అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తున్నారు. రోడ్ల వెంట బ్రిడ్జిల వద్ద కూడా ప్రధాన రహదారిపై తనిఖీలు చేస్తున్నారు.
చత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత నాలుగు రోజుల క్రితం సరిహద్దు రాష్ట్రంలో కల్వర్టు కింద బాంబు పేల్చి పదిమంది పోలీసులను మట్టు పెట్టిననేపథ్యంలో ముందు జాగ్రత్తగా పై అధికారుల ఆదేశాలతో
ఈ. బయ్యారం సీఐ రాజ గోపాల్, ఎస్సై నాగుల్ మీరా ఖాన్ సిబ్బందితో ఏటూరునాగారం మణుగూరు ప్రధాన రహదారిపై కల్వర్టులు, బ్రిడ్జిలపై తనిఖీలు చేపట్టారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.









