Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుయాదాద్రి భువనగిరి జిల్లా
అంగరంగ వైభవంగాశ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం
అంగరంగ వైభవంగాశ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం
వలిగొండ, మన సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో యాదవ సంఘం ఆరాధ్య దైవమైన మల్లికార్జున స్వామి వారి కళ్యాణ వేడుకలు యాదవ సంఘం అధ్యక్షులు ఆవుల స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆవుల స్వామి మాట్లాడుతూ కళ్యాణానికి విచ్చేసిన బంధుమిత్రులకు భక్త జనానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్య గిరి గుట్ట మాజీ డైరెక్టర్ కసర బోయిన లింగయ్య గోడ్డేటి సత్యం వారి కుటుంబ సభ్యులు మరియు రామకోటి, మహేష్ ,నవీన్ రమేష్ సత్తయ్య మర్రి ముత్యాలు , మత్స్య గిరి, మరియు యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు









