Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

Result : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల 

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల 

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 63.85% ఉత్తీర్ణత కాగా ద్వితీయ సంవత్సరంలో 67.26% ఉత్తీర్ణత సాధించినట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

 

ఒత్తిడి ఉండకూడదనే ఉద్దేశంతో ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఉత్తీర్ణత సాధించిన వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి వెంటనే జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష రాసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

 

ఎలాంటి ఆందోళన చెందవద్దని విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ సదుపాయం కూడా కల్పించినట్లు ఆమె తెలియజేశారు.

 

ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణతలో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణతలో ములుగు జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లు ఆమె తెలియజేశారు.

 

తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 92 శాతం, సోషల్ వెల్ఫేర్ కళాశాలలో  86% ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తెలిపారు. బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో 87% ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో 84 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు