Suside : మొబైల్ చూస్తూ కాలయాపన.. ఆ తర్వాత ఆత్మహత్య..!
Suside : మొబైల్ చూస్తూ కాలయాపన.. ఆ తర్వాత ఆత్మహత్య..!
లక్షేట్టిపేట్ , (మన సాక్షి);
లక్షెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన గుండారపు శ్రీనివాస్(22)సంవత్సరాల వయస్సు గల యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి చెప్పిన వివరాల ప్రకార..
మృతుడు లక్షెట్టిపేట ట్రెండ్స్ బట్టల దుకాణంలో ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసుకునేవాడు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. తల్లి తండ్రులు వివాహం విషయం తీసినప్పుడల్లా కోపగించుకునేవాని. అందరితో కలుపుగోలుగా ఉండేవాడు కూడా కాదని. తీరిక సమయంలో ఎప్పుడు మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తు కాలయాపన చేసేవాడు.
మే 25 బుధవారం రోజున రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చి తిన్న తర్వాత మొబైల్ ఫోన్లో వీడియోలను చూస్తు ఉండగా తల్లితండ్రులు ఎప్పుడు ఫోన్ పట్టుకుని వీడియోలు చూడటమేనా పెండ్లి చేసుకోవా అని అనగా కోపగించుకున్నాడు .
ఇంట్లోకి వెల్లి పురుగల మందు తాగి బయలకు వచ్చి వాంతులు చేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరెగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడని తెలిపారు.
ఇప్పుడు తండ్రి మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.









