Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!

Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!

హైదరాబాద్, మనసాక్షి :

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ వైఫైతో సహా నిత్యవసరంగా మారింది. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్లను వైఫైతో ఉపయోగించడంతో పాటు ల్యాబ్ టాప్, టీవీలను వైఫై తో కనెక్ట్ చేసుకొని వాడుతున్నారు.

 

కాగా వైఫై రూటర్ ని 24 గంటలు ఆన్ చేసే ఉంచుతున్నారా…? అయితే కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

 

సెల్ ఫోన్ ఉపయోగిస్తే నే రాత్రి సమయంలో పక్కనే పెట్టుకుంటే… నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుకోసం నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ పక్కన పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

 

ఉదయం వేళలో ఎలాగో వైఫై ఉపయోగిస్తారు. కాబట్టి దానిని ఆన్ లోనే ఉంచుతారు. రాత్రి వేళలో కూడా దాన్ని ఆన్ లోనే ఉంచుతున్నారా..? 24 గంటల పాటు మీ వైఫై ఆన్ లోనే ఉంటే ప్రమాదకరమా..? అవునని చెప్పవచ్చును.

 

వైఫై రూటర్ ఆన్ లో ఉన్నప్పుడు ఇల్లంతా రేడియేషన్ ప్రసారం అవుతుంది. ఈ రేడియేషన్ ఇంటి గోడల పైకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైఫై రూటర్ గార్డ్ ఉపయోగించని పక్షంలో ఈ రేడియేషన్ చాలా హాని కలిగిస్తుంది.

 

మీ వైఫై రాత్రి సమయంలో ఆన్ లోనే ఉంచితే ఎలక్ట్రానిక్ పరికరాలకు రేడియేషన్ ఉంటుంది. దీని వల్ల శరీరంలోని పీనియల్ గ్రంధి పనితీరు మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

ఈ గ్రంధి శరీరంలో మెలటోనియన్ ఉత్పత్తి చేస్తుంది . ఇది నిద్ర ను నియంత్రించే హార్మోన్. రేడియేషన్ ప్రభావం దీనిపై పడటం వల్ల నిద్ర భంగం అయ్యే అవకాశం ఉంది.

 

Also Read : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

రాత్రిపూట వైఫై ఆన్ లోనే ఉంటే ఈ నిద్ర వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి . అంతే కాకుండా కండరాల పనితీరు దెబ్బతినడంతో పాటు శరీరంలో టాక్సీటీలు బయటకు పంపే ఆటంకం కూడా ఏర్పడనున్నది.

 

శరీరంలో ప్రతి సెకండ్ కు ఎర్ర రక్త కణాలు రెండు మిలియన్ల కంటే ఎక్కువగానే ఉత్పత్తి అవుతాయి. ఈ రేడియేషన్ వల్ల శరీరంలో రక్షణ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

 

దీనివల్ల మెదడు పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. శరీరంలో కణాలు తొందరగా విచ్చిన్నం కావడం వల్ల మనిషి జీవితకాలం తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు