Miryalaguda | దశాబ్ది ఉత్సవాలు సరే.. హామీల అమలేది..? – జూలకంటి
దశాబ్ది ఉత్సవాలు సరే.. హామీల అమలేది..?
విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ, మన సాక్షి:
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కానీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన మిర్యాలగూడ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, రోజుకు ఓ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుతున్నారని తెలిపారు .
ALSO READ : Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!
ఈ సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు . ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, వాటి విషయంపై ప్రజలకు వివరించాలన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ పాలమూరు- రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం, ఎస్ ఎల్ బి సి టన్నల్ ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని చెప్పారు. ఈ పనులు పూర్తయి ఎందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు.
ALSO READ : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!
నిధుల విడుదలలో జాప్యం చేయడంతో పాటు వివక్ష చూపుతున్నారని చెప్పారు. పూర్తిస్థాయిలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని అన్నారు. లిఫ్టులు మరమ్మతులకు నోచుకోక శిధిలాస్థానికి చేరుకుంటున్నాయని పోయారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అమలు చేసి రైతుల కష్టాలను తీర్చాలన్నారు.
ALSO READ : Virupaksha Memes : విరూపాక్ష మీమ్స్… నాన్ స్టాప్ కామెడీ.. నెట్టింట్లో వైరల్ (వీడియోస్)
పోడు భూముల సమస్యలను పరిష్కరించి ప్రతి రైతుకు పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూ పంపిణీ పై సమాధానం చెప్పాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర ,జిల్లా కమిటీ సభ్యులు వినోద్ నాయక్, పరుశురాములు, ఎండి అంజద్, నాయకులు రామారావు, సోమయ్య, మల్లయ్య,జాతంగి సైదులు తదితరులు పాల్గొన్నారు.









