Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసంక్షేమంహైదరాబాద్

Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట సహాయంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

 

రైతుబంధు పథకం ద్వారా ప్రతి రైతుకు ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయలు పెట్టుబడి సహాయం అందజేస్తున్నారు. వీటిని వానాకాలం సీజన్ లో ఎకరానికి 5000 రూపాయలు, యాసంగి సీజన్ లో ఎకరానికి 5000 రూపాయల సహాయాన్ని అందజేస్తున్నారు.

 

Also read : Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది రైతులకు 7400 కోట్ల రూపాయలు ప్రతి సీజన్ కు అందజేస్తున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్ లో జూన్ మాసంలో రైతుబంధు పథకాన్ని అమలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడానికి అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

 

కొత్తవారికి అవకాశం , ఇలా చేయాలి : 

ఈ ఏడాది కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. ఆ రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ తో సహా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు అందజేయాలని ప్రభుత్వం సూచించింది.

 

కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు మొదటిసారి రైతుబంధు కోసం తప్పనిసరిగా ఏఈఓ లను సంప్రదించాల్సి ఉంది. ప్రస్తుతం ఏ ఈ ఓ లు రైతుల వద్ద నుంచి వచ్చిన రైతు బంధు పథకాల దరఖాస్తులను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. రైతు బంధు పథకం కోసం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు తప్పనిసరిగా అందచేయాల్సి ఉంది.

 

Also read : Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

నెలాఖరులోగా రైతుబంధు :

రైతు బంధు పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని జూన్ నెలాఖరులోగా అందజేయడానికి అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా రోజువారిగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు. మొదటి రోజు ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతుబంధు సహాయాన్ని ఖాతాలలో జమ చేస్తారు.

 

అదే విధంగా ఆ తర్వాత ఎకరం చొప్పున పెంచుతూ రైతుబంధు సహాయాన్ని అందజేయనున్నారు. ఈ ప్రక్రియను మరో పది రోజులలో ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో రైతుబంధు అందరి రైతులకు అందేలా చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు