Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad | ఎల్బీనగర్ లో కుప్పకూలిన ఫై ఓవర్, 10 మంది గాయాలు..!

Hyderabad | ఎల్బీనగర్ లో కుప్పకూలిన ఫై ఓవర్, 10 మంది గాయాలు..!

హైదరాబాద్ మన సాక్షి హైదరాబాదులోని ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం సంభవించింది. ఫ్లైఓవర్ ర్యాప్ కుప్పకూలింది. దాంతో పదిమంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికి తల పగిలింది. గాయాలైన వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాత్రి సమయంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండగా సిమెంట్ మిక్చర్ లారీ ఫ్లైఓవర్ కి తగలడంతో రెండు పిల్లర్ల మధ్యలోని ర్యాంపు కుప్పకూలింది. దాంతో ఈ ప్రమాదం సంభవించింది. కార్మికులు, బీహార్ ఉత్తరప్రదేశ్ గా గుర్తించారు. హైదరాబాదులోని పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిన ఘటన తర్వాత హైదరాబాదులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవది. విషయం తెలుసుకున్న జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి సమీక్షించారు.

మరిన్ని వార్తలు