Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!
Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!
మిర్యాలగూడ, మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా రైతు బీమా పథకం చేపట్టింది. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చేపట్టిన సంక్షేమ పథకాలలో రైతు బీమా ప్రధానమైనది.
రైతు బంధు పథకం ద్వారా రైతులకు సాగు సహాయం అందిస్తుంది. ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందిస్తుంది.
రైతు భీమా పథకాన్ని కూడా అమలు చేస్తుంది. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే అతని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చింది. కాగా ఈ పథకం రైతు కుటుంబాలను ఆదుకుంటుంది.
🟢 ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి.. 👇
1. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!
2. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!
3. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!
4. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!
5. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!
రైతు భీమాకు దరఖాస్తు ఇలా..!
రైతు భీమా 2023 – 24 సంబంధించి 2023 జూలై 10 వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.
> జూలై 10వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవచ్చు.
> ధరఖాస్తు దారుడైన రైతుకు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండాలి.
> 2023 జూన్ 18వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకం అందుకున్న రైతులు దరఖాస్తులకు అర్హులు.
> పట్టాదారు పాస్ పుస్తకం,
> ఆధార్ కార్డు జీరాక్స్ ,
> నామిని ఆధార్ కార్డు జిరాక్స్.
వ్యవసాయ విస్తరణాధికారి కానీ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో కానీ రైతులు స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
ఈ విషయాన్ని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి స్టెఫీ గ్రాఫ్ తెలిపారు. రైతు భీమా ధరఖాస్తులను చేసుకోవడానికి రైతులు ముందుకు రావాలని కోరారు.









