RRR : ఆర్ఆర్ఆర్ కు అవార్డుల్లో సిక్సర్.. ఆరు విభాగాల్లో అవార్డులు..!
RRR : ఆర్ఆర్ఆర్ కు అవార్డుల్లో సిక్సర్.. ఆరు విభాగాల్లో అవార్డులు..!
హైదరాబాద్, మనసాక్షి :
ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల్లో సిక్సర్ కొట్టింది . ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు జాతీయస్థాయి అవార్డుల్లో సైతం ఆరు విభాగాల్లో అవార్డులు సాధించింది. గతంలో ఏ ఇండియన్ సినిమా కూడా సాదించని ఎన్నో రికార్డులను ఈ సినిమా దక్కించుకుంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా అదే హవా కొనసాగుతోంది. జాతీయ అవార్డుల్లో సైతం సత్తా చాటి ఆరు అవార్డులను సొంతం చేసుకుంది.
ALSO READ :
- Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
- నల్లగొండ : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!
- మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!
- TELANGANA : బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా 2021 మార్చి 25వ తేదీన విడుదల అయింది. అప్పటినుంచి ఈ సినిమా ఇప్పటివరకు ఇంకా సత్తా చాటుతూనే ఉంది. అప్పట్లో బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.
అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. “నాటు నాటు పాట ” వైరల్ కావడంతో ఆస్కార్ అవార్డు సైతం దక్కించుకుంది . ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ ఆరు విభాగాలలో అవార్డులను సొంతం చేసుకుంది.
సొంతం చేసుకున్నవార్డుల జాబితా :
1. బెస్ట్ కొరియోగ్రాఫర్ – ప్రేమ్ రక్షిత్
2. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – కీరవాణి
3. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ – కింగ్ సోలోమన్
4. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – శ్రీనివాస్ మోహన్
5. బెస్ట్ మెయిల్ ప్లే బ్యాక్ సింగర్ -కాలభైరవ
6. బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడి క్ హోల్ ఎంటర్టైన్మెంట్ – ఆర్ ఆర్ఆర్.










