Ponguleti : పొంగులేటి మూడు చోట్ల నుంచి దరఖాస్తులు.. ఎందుకో తెలుసా..!
Ponguleti : పొంగులేటి మూడు చోట్ల నుంచి దరఖాస్తులు.. ఎందుకో తెలుసా..!
హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణలో ఖమ్మం జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు రాజకీయాలలో మార్పు ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుంటాయి. అలాంటిది ఇటీవల బి.ఆర్.ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం కూడా బి.ఆర్.ఎస్ గెలవకుండా చేస్తానని కేసిఆర్ కు సవాల్ విసిరిన విషయం కూడా తెలిసిందే.
కాగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం కూడా సస్పెన్స్ లో ఉంచారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో మూడు స్థానాలకు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఖమ్మం జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉన్నాయి. వాటిలో కేవలం మూడు స్థానాలు మాత్రమే జనరల్ స్థానాలు ఉన్నాయి.
అయితే ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను దరఖాస్తులలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలైన జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు స్థానాల నుంచి ఆయన టికెట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పాలేరు నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగడంతో పాటు ఖమ్మం నుండి పోటీ చేస్తారని ప్రచారం కూడా సాగింది . ఆయన కొత్తగూడెం నుంచి కూడా బరిలోకి దిగుతారనే ప్రచారం సాగింది. మూడు స్థానాలలో టికెట్లు కావాలని దరఖాస్తులు చేసుకోవడం చర్చనీ అంశంగా మారింది.
ALSO READ :
- మిర్యాలగూడ: ఎమ్మెల్యే టికెట్ కోసం ముదిరెడ్డి నర్సిరెడ్డి దరఖాస్తు..!
- మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు..!
- భయంతోనే ఆయనకు మంత్రి పదవి : రేవంత్ రెడ్డి
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం
- Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
మూడు స్థానాలలో దరఖాస్తులు ఎందుకు..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ స్థానాలలో కొత్తగూడెం, ఖమ్మం ,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశిస్తూ దరఖాస్తు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చేసుకున్నారంటే .. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం.
పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా సాగుతుంది. ఒకవేళ వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సి వస్తే పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది .
అందుకుగాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని గోప్యంగా ఉంచడంతోపాటు, సస్పెన్స్ లో ఉంచుతూ మూడు స్థానాలకు టికెట్లు ఆశిస్తూ దరఖాస్తులు చేసుకున్నారని గాంధీభవన్లో చర్చ సాగుతుంది. ఏది ఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ స్థానాలైనా కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గం ఖాయమని అంటున్నారు.









