మిర్యాలగూడ: ఎమ్మెల్యే టికెట్ కోసం ముదిరెడ్డి నర్సిరెడ్డి దరఖాస్తు..!
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు.

మిర్యాలగూడ: ఎమ్మెల్యే టికెట్ కోసం ముదిరెడ్డి నర్సిరెడ్డి దరఖాస్తు..!
మిర్యాలగూడ , మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ టికెట్లకు ఆశావాహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
కాగా హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శుక్రవారం ఆయన దరఖాస్తును అందజేశారు. ముదిరెడ్డి నర్సిరెడ్డి మిర్యాలగూడ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరాడు. కిసాన్ సెల్ విభాగం తరఫున తనకు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే గెలుపు తద్యమని పేర్కొన్నారు.
ALSO READ :
- మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు..!
- Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం
- TELANGANA : బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్