Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంసంక్షేమం

మిర్యాలగూడ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్..!

మిర్యాలగూడ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్..!

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మిర్యాలగూడ  ,మన సాక్షి :

సంక్షేమ పథకాల అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు శనివారం నల్గొండ జిల్లా
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్ లో జరిగిన బిసి బంధు 1 లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే భాస్కర్ రావు తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదన్నారు.

 

పుట్టిన బిడ్డ దగ్గర నుండి పెరిగి పెద్దయి ప్రయోజకులు అయ్యే వరకు కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న సర్కార్ తెలంగాణ మాత్రమేనన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ సీఎం అయితేనే రైతు బంధు, రైతు భీమా ,బిసి బంధు , 24 గంటల ఉచిత కరెంట్ పథకాలు అమలు అవుతాయని ఆయన చెప్పారు.

 

ప్రతిపక్షాలు చెప్పే కళ్ళబొల్లి మాటలకు మోసపోయి వారి చేతికి అధికారం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే మళ్ళీ ఆదరించాలని అప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

 

ALSO READ : 

  1. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
  2. How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
  3. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
  4. ఆపదలో ఓ నిరుపేద కుటుంబం.. దాతల కోసం ఎదురుచూపు..!
  5. మిర్యాలగూడ : కాంగ్రెస్ టికెట్ కోసం చల్ల తేజ దరఖాస్తు
  6. మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు..!

 

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , మున్సిపల్ తిరునగర్ భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, జడ్పిటిసిలు ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు ,బి ఆర్ యస్ పార్టీనేతలు ,
తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు