Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

నిప్పులపై నడిచిన విద్యార్థిని.. మిగతా విద్యార్థులు అంతా షాక్..!

నిప్పులపై నడిచిన విద్యార్థిని.. మిగతా విద్యార్థులు అంతా షాక్..!

పెన్ పహాడ్ , మనసాక్షి :

మూఢనమ్మకాలతో ప్రజలు ఇంకా భయాందోళన లు చెందుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అనేక సంస్థలు చైతన్యం కల్పించినప్పటికీ ఇంకా మూఢనమ్మకాల దృష్టితోనే ప్రజలు ఉన్నారు శనివారం సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలంలో విద్యార్థులను మూఢనమ్మకాల వైపు నుంచి శాస్త్రీయ దృక్పథం వైపు మరలచేందుకు విద్యార్థులచే ఇంద్రజాల అధ్యాపకులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా విద్యార్థులను నిప్పులపై కూడా నడిపించారు. నిప్పుల పై నడిచిన విద్యార్థినికి ఏమి కాకపోవడంతో మిగతా విద్యార్థులు అంతా షాక్ అయ్యారు.

 

విద్యార్థులు చిన్ననాటి నుండే శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని న్యూ ప్రజ్ఞా హై స్కూల్ చంద్రయాన్ -3 విజయోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయలు, మంత్రాలు ఉండవని గారడి వారి చేసే మ్యాజిక్కులను మరియు బాబాలు చేసే ట్రిక్కులని కూడా సైన్స్ ప్రయోగంలోనే బాగాలేనని వాటిని ప్రయోగాలు గానే భావించాలని మహిమలు కావాని ఆయన పేర్కొన్నారు.

 

 

చంద్రయాన్ 3 భారతీయ శాస్త్రజ్ఞుల ప్రతిభ పాటవాలేనని ఈ సందర్భంగా మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన వారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇంద్రజాల అధ్యాపకులు చంద్రయ్య మాట్లాడుతూ ఎవరైతే పరిశీలిస్తారో వారే పరిశోధకులు అవుతారని, రాబోయే కాలంలో కాబోయే శాస్త్రజ్ఞులు అవుతారని ఆయన తెలిపారు.

 

MOST READ :

  1. How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
  2. Ponguleti : పొంగులేటి మూడు చోట్ల నుంచి దరఖాస్తులు.. ఎందుకో తెలుసా..!
  3. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
  4. Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
  5. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

 

ఈ సందర్భంగా నాలుకకు త్రిశూలం పుచ్చుకోవడం, అరచేతిలో హారతి వెలిగించుకోవడం, మంటలు మింగడం, మంటలపై నడవడం, వేడి వేడి నూనె నుండి బజ్జీలు చేతితో తీయడం వెనక ఉన్న సైన్సును విద్యార్థులకు కళ్ళకు కట్టినట్లు ఆయన శాస్త్రీయంగా వివరించారు.

 

స్వీయ అనుభవంతో పిల్లలు నేర్చుకున్నారు. అంతకుముందు మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేశాయి మదర్ సేవా భావాలను చిన్ననాటి నుండి పిల్లలు అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోపాఠశాల కరస్పాండెంట్ కృష్ణమూర్తి, పాఠశాల చైర్మన్ పుష్పలత, ప్రధానోపాధ్యాయులు సతీష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సైదులు ఆంజనేయులు, జనార్ధన్ బద్రి , జ్యోతి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు