Breaking Newsfoodఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతెలంగాణ

Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!

Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

టీ తాగని వారు చాలా అరుదుగా ఉంటారు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి తమ కార్యకలాపాలను టీ తాగడంతోనే ప్రారంభిస్తారు. కొంతమంది రోజుకు నాలుగైదు పర్యాయాలు కూడా టీ తాగుతుంటారు. మరి కొంతమంది టీ తాగే సమయంలో రకరకాల పదార్థాలను సైతం తింటుంటారు. అలా తినడం వల్ల ఆరోగ్యానికి హానీకలిగే అవకాశం ఉంది. టీ తాగేటప్పుడు ఏ ఏ పదార్థాలు అసలు ముట్టుకోవద్దు..? టీలో ఏమి కలుపుకోవద్దు..? ఒకసారి పరిశీలిద్దాం..

 

బిస్కెట్లు :

బిస్కెట్లు ఎక్కువమంది టీ తాగే ముందు కానీ టీతోపాటు కలుపుకొని గాని బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ రెండు కలయిక పేగు ఆరోగ్యానికి హానికరమైంది. బిస్కెట్లు మైదా, పంచదారతో కలిపి తయారుచేస్తారు. టీ లో పంచదార ఎలాగూ ఉంటుంది. దాంతోపాటు మైదా తీసుకోవడం జీర్ణశక్తికి మంచిది కాదు. దీని కారణంగా ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

 

వడలు :

 

టీ తో కలిపి తింటే బచ్చలి కూరతో తయారుచేసిన వడలు మంచిది కాదు. నిజానికి బచ్చలి కూరలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. టానిన్లు కలిసి ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ సోషలను నిరోధిస్తాయి. కాబట్టి టీతోపాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.

 

ALSO READ : 

  1. నారాయణపేట : ఓటర్ జాబితా తప్పులు లేకుండా సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 
  2. Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
  3. Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
  4. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
  5. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !

 

టీ తాగిన తర్వాత మంచినీరు త్రాగవచ్చా?

టీ తాగిన తర్వాత మంచినీరు త్రాగవచ్చా..? లేదా..? అనేది చాలామంది చెబుతుంటారు. టీ తాగిన వెంటనే మంచినీరు త్రాగకూడదు. మంచినీటితో పాటు చల్లని పదార్థాలైన ఐస్ క్రీమ్, కూల్డ్రింక్స్ లాంటివి కూడా తాగకూడదు. దానివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని సమస్యలు ఏర్పడతాయి.

 

నిమ్మరసం :

టీ తాగిన తర్వాత నిమ్మరసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. టితోపాటు నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎసిడిటీ జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. టి తర్వాత నిమ్మరసం తాగితే మరింత ఆమ్లంగా మారి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.

మరిన్ని వార్తలు