Green Gro : గ్రీన్ గ్రోలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవం వేడుకలు
గ్రీన్ గ్రోలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవం వేడుకలు
చౌటుప్పల్ . మన సాక్షి :
చౌటుప్పల్ పట్టణ పరిధిలో గల గ్రీన్ గ్రో పాఠశాల లో జాతీయ క్రీడా దినోత్సవం , తెలుగు భాషా దినోత్సవం సందర్భంగాఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడలను నిర్వహించారు. ప్రముఖహాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పాఠశాలల చైర్ పర్సన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శారీరక,మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు.ధ్యాన్ చంద్ స్ఫూర్తిని పునికి పుచ్చుకోవాలని అన్నారు.
ALSO READ :
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- RTC : ఆర్ టి సి కార్మికుల విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు.. పుస్తకం ఆవిష్కరణ..!
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
తెలుగు భాష గొప్పతనాన్ని విస్మరించకూడదని, మాతృభాష తల్లిపాల వంటిదని విద్యార్థులకు గుర్తు చేస్తూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు అనిల్ ను శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎస్ లక్ష్మి, అనిల్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









