Road Accident : రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం.. అంతా ఓకే కుటుంబానికి చెందినవారు..!
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం.. అంతా ఓకే కుటుంబానికి చెందినవారు..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
రోడ్డు ప్రమాదంలో అంతా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన బీహార్ లోని రోహతాస్ జరిగింది. బుధవారం శివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పఖ్నారి సమయంలో జాతీయ రహదారి -2 పై ఆగి ఉన్న కంటేనర్ ను స్కార్పియో ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వాహనంలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు .
ALSO READ :
- Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!
- TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!
- WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైవే పై ఆగి ఉన్న కంటైనర్ ను స్కార్పియో వేగంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మృతి చెందిన ఏడుగురు వ్యక్తులు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరంతా బోధ్ గయా నుంచి కైమూర్ జిల్లా కుడారి గ్రామానికి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ALSO READ :
1. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
2. Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
3. Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
ఈ సంఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నూరుగా వినిపించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రక్కుల డ్రైవర్లు వాహనాలని హైవేపై పార్కు చేసి వదిలేస్తుండటం వల్ల చీకట్లో వేగంగా వస్తున్న వాహనాలకు సరిగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని,ఈ సంఘటన వలన ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.









