Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?

SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?

న్యూఢిల్లీ , మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భేటీ గురువారం ముగిసింది. కొంతకాలంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆ దిశలోనే షర్మిల సోనియాగాంధీని కలిసిందని ఊహాగానాలు వస్తున్నాయి. షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కూడా సోనియా గాంధీ భేటీలో ఉన్నారు.

 

షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆమె తెలంగాణలో కార్యకలాపాలు చేపట్టనున్నదా..? ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు చేపట్టనున్నదా..? అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

 

ALSO READ : 

  1. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  2. Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
  3. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!
  4. Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!

 

ఉదయం 8:30 గంటలకు సమావేశం అయిన వారు సుమారు గంటన్నర పాటు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ , రాహుల్ గాంధీతో సమావేశం జరిగిందని, నిర్మాణాత్మక చర్యలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తుందని, కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు