Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంసూర్యాపేట జిల్లా

Congress Party : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు

Congress Party : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్

సూర్యాపేట, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాలకీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గాను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మోసపూరిత హామీలతో పాలన సాగిస్తుందని విమర్శించారు.

 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు.గృహలక్ష్మి పథకం అమలు చేసి పేదలందరికీ ఇండ్లు ఇస్తుందని పేర్కొన్నారు.

 

ALSO READ : 

  1. రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!
  2. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  3. SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?
  4. జగదీష్ రెడ్డి ఆస్తుల పై ఈ డి విచారణ జరిపించాలి
  5. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

 

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గృహలక్ష్మి పథకం పేరుతో సీఎం కేసీఆర్ పేద ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచనకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

 

వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో దామరచర్ల మండలం ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షుడు వడ్త్యా కృష్ణ నాయక్ నాయక్ మండల కాంగ్రెస్ నాయకులు జైత్యా నాయక్, సైదా నాయక్,దినేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  2. Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!
  3. Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
  4. TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!

మరిన్ని వార్తలు