Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయాలి.. బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ : కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయాలి.. బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్  బిఎల్ఆర్ అన్నారు.

రాహుల్ జూడో యాత్ర చేసి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసిసి పిలుపుమేరకు గురువారం బ్లాక్ కాంగ్రెస్ , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఈదులగూడెం చౌరస్తా వరకు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల తో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

ALSO READ : 

  1. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
  2. Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
  3. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
  4. ISRO : నేడు సూర్యుడు పై అధ్యయనానికి ఇస్రో ప్రయోగం.. ఆదిత్య L-1 ప్రయోగం..!
  5. సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ జుడోయాత్ర 7 సెప్టెంబర్ 2022 న మొదలై కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 146 రోజులు 5000 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు బాధలు తెలుసుకున్నారని అన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిన అగ్ర నాయకుడని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కొరకు అహర్నిశలు ఆలోచించే అభ్యున్నతవాది రాహుల్ గాంధీ కి హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు వార్డ్ ఇన్చార్జిలు ఎంపీటీసీలు సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, పొదిల శ్రీనివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి, తమ్ముడు బోయిన అర్జున్, దేశిడి శేఖర్ రెడ్డి, చల్లా అంజిరెడ్డి, శాగ జలంధర్ రెడ్ది, జానీ , రామకృష్ణ , సిద్దు నాయక్ , పాతూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

  1. రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!
  2. Congress Party : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
  3. Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
  4. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!

మరిన్ని వార్తలు