నాగిరెడ్డిపేట్ : యువకుడి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట్ : యువకుడి ఆత్మహత్య
నాగిరెడ్డి పేట్, మన సాక్షి :
నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన గడ్డమీది ప్రవీణ్ ( 28 ) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగు లేక జీవితంపై విరక్తి చెంది చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..
బొల్లారం గ్రామానికి చెందిన గడ్డమీది ప్రవీణ్ మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళ వారం ప్రవీణ్ మేస్త్రి పనికి వెళ్లలేదని, తమ గ్రామం పక్కనే ఉన్న జప్తి జానకం పల్లి గ్రామంలో గ్రామస్తులు మంగళవారం బోనాల పండుగ నిర్వహిస్తున్నందున, బోనాల పండుగను చూసొస్తానని ఇంట్లో చెప్పి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బైక్ తీసుకొని వెళ్లినట్టు తెలిపారు.
ALSO READ : WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!
రాత్రి అయినా ప్రవీణ్ ఇంటికి రాకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు గాలించగా అతని ఆచూకి తెలియలేదని, తిరిగి బుధవారం ఉదయం ప్రవీణ్ కోసం గాలిస్తుండగా తమ చేను వద్ద బైకు పెట్టి, చేనులో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి గడ్డమీది సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!










