పల్లె పల్లెకు కవ్వంపల్లి.. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ..!
పల్లె పల్లెకు కవ్వంపల్లి.. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ..!
ఇల్లంతకుంట, మన సాక్షి:
పల్లె పల్లెకు కవ్వంపల్లి – గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మండలంలోనిచింతలకుంటపల్లె, తిప్పాపూర్, యాదవ నగర్, దమ్మన్పల్లి గ్రామాలలో పాదయాత్ర చేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాలను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు వివరించారు.
ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!
గ్రామంలోని ప్రజలందరు గత తొమ్మిది సంవత్సరాలనుండి మా గ్రామాన్ని ఏ మాత్రం పట్టించుకోని ఎమ్మెల్యేను తరిమికొడుదాం అంటూ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కవ్వంపల్లి సత్యనారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, అయిలయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, పసుల వెంకటి, కరుణాకర్ రెడ్డి, వినయ్ కుమార్, కాత మల్లేషం కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : Nalgonda : నల్గొండలో విచిత్ర దొంగలు.. వాళ్లు దోచుకునేవి ఏంటో తెలుసా..!









