యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో..స్కూల్ కిట్స్ పంపిణీ..!
యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో..స్కూల్ కిట్స్ పంపిణీ..!
మర్రిగూడ, మన సాక్షి:
మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిదండ్రులు లేని పిల్లలకు మరియు నిరుపేద విద్యార్థులకు 30000 వేల రూపాయల విలువ అయిన స్కూల్ కిట్స్ బ్యాగులు 35 మంది విద్యార్థుల కి పంపిణీ చేయడం జరిగింది. ఈ కిట్టులో, బ్యాగు, డిక్షనరీ, దేశ భక్తి నాయకుల స్టికర్స్, జామెట్రీ బాక్స్, పెన్నులు,పెన్సిల్లు కలిపి ఒకకిట్టుగాతయారుచేసిఇవ్వడంజరిగింది.
ALSO READ : Chandra Babu : చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. సిఐడి కస్టడీకి చంద్రబాబు..!
ఈ సందర్భంగా ఆ సంస్థ సభ్యులు మాట్లాడుతూ మర్రిగూడ మండలంలో ఉన్నటువంటి అందరి నిరుపేద విద్యార్థులకు పక్షాన నిలబడేందుకే ఈ సంస్థ ప్రారంభించామని, గత ఎనిమిది సంవత్సరాల నుంచి సేవా దృక్పధం తో కరోనా సమన్లు నిత్యవసర సరుకులు, స్వామి వివేకానంద జయంతికి రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ మొదలగు కార్యక్రమాలు చేపడుతున్నామని మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.
ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!
స్వామి వివేకానంద స్ఫూర్తి ఆధారంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని మిగతా యువత అంతా కూడా స్వామీజీని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో సిలివేరు రఘు, పగడాల రఘు, అంజి, శేఖర్, శంకర్, సందేశ్, దశరథ్, పవన్, రమేష్, వెంకటేష్, కిషోర్, పాండు, శ్రీకాంత్, మారి శ్రీశైలం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









