Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణపండుగలు

పొంగులేటి ప్రసాదరెడ్డి విస్తుత పర్యటన..!

పొంగులేటి ప్రసాదరెడ్డి విస్తుత పర్యటన..!

వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, విరాళాలు అందజేత

నేలకొండపల్లి, మనసాక్షి.

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటి కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి నేలకొండపల్లి మండలం లో పర్యటించారు. పర్యటన లో భాగంగా మండలం లోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మండల ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని వినాయకుడు ను వేడుకున్నారు. మండపానికి రూ. 5 వేల చొప్పున ప్రతీ మండపానికి విరాళాలను అందించారు. ఈ సందర్భంగా మండలం లోని వివిధ గ్రామాల్లో ఘనంగా స్వాగతం పలికారు. మండపాల కమిటి నిర్వహకులు ఘనంగా సన్మానించారు.

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

అదే Iవిధంగా వివిధ గ్రామాల్లో ఇటీవల ప్రమాదాలకు గురైన పలువురును పరామర్శించారు. అనారోగ్యంతో భాదపడుతున్న వారిని పరామర్శించి, ఆరోగ్య యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చావా శివరామకృష్ణ, కొడాలి గోవిందరావు, నెల్లూరి భద్రయ్య, చెరువు స్వర్ణ, సర్పంచ్లు పెంటమళ్ల పుల్లమ్మ, బచ్చలకూరి జ్యోతి, దొనకొండ రామకృష్ణమండల నాయకులు వాకా శ్రీనాధ్, చిదుముల జాన్రెడ్డి, యం.వెంకన్న, జంగం లక్ష్మినారాయణ. కొమ్మినేని విజయ్, చిలకల సీతారావమ్మ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

మరిన్ని వార్తలు