Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!

మిర్యాలగూడ : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!

అధ్యక్షులుగా గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణ చౌదరి ఏకగ్రీవ ఎన్నిక

కార్యదర్శి -2, ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులకు ఎన్నికలు

మిర్యాలగూడ , మన సాక్షి:

మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 2023 -25 పాలకవర్గం ఎన్నికలు ఉత్కంఠ భరితంగా ఆదివారం అసోసియేషన్ భవనంలో జరిగాయి. రైస్ మిల్లర్స్ అధ్యక్షులుగా గౌరు శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా కార్యదర్శి -2, ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించారు.

రైస్ మిల్లర్స్ అధ్యక్షులుగా గౌరు శ్రీనివాస్ పేరును రాష్ట్ర మిల్లర్స్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ ప్రతిపాదించగా డాక్టర్ బండారు కుశలయ్య బలపరిచారు. నామినేషన్ల సమయం ముగిసే వరకు ఏ ఒక్కరు అధ్యక్ష స్థానానికి పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో గౌరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణ చౌదరి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

ఉపాధ్యక్ష పదవికి ముగ్గురు  వెంకటేశ్వర్లు , గుడిపాటి శ్రీనివాస్, గంట సంతోష్ రెడ్డిలు. పోటీ చేయగా గుడిపాటి శ్రీనివాస్ పై 05 ఓట్ల మెజార్టీతో సంతోష్ రెడ్డి ఉపాధ్యక్షులుగాఎన్నికయ్యారు.  కార్యదర్శి (2) పదవికి రంగాలింగయ్య, మా శెట్టి శ్రీనివాస్, గుడిపాటి అప్పారావు, పోటీ చేయగా మా శెట్టి శ్రీనివాస్ పై 27 ఓట్ల మెజార్టీతో రంగ లింగయ్య  ఎన్నికయ్యారు.

కోశాధికారిగా పైడిమరి సురేష్, చిల్లంచర్ల శ్రీనివాస్  పోటీ చేయగా పైడిమరి సురేష్ పై చిల్లంచర్ల శ్రీనివాస్ 21 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 10 మంది కార్యవర్గ సభ్యుల కోసం 35 మంది అభ్యర్థులు పోటి పడగా డ్రా పద్ధతిలో 10 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక చేశారు.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

కార్యవర్గ సభ్యులుగా గౌరు శంకర్ రావు , రాయిని శ్రీనివాస్, బూరుగు సత్యనారాయణ, పబ్బతి కర్ణాకర్ రావు, పైడిమరి రంగనాథ్, వెన్నె వెంకట కాశి రామారావు, ఓరుగంటి సత్యనారాయణ, గార్లపాటి శ్రీనివాస్, గార్లపాటి మధు, ఓరుగంటి రమేష్ లు ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారిగా డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పందిరి రవీందర్ వ్యవహరించారు. మిల్లర్స్ ఎన్నికల్లో 85 మంది తమ ఓటు హక్కునువినియోగించుకోవలసి ఉండగా నలుగురు విదేశీ పర్యటనలో ఉండడంవల్ల 81 మంది తమ ఓటు హక్కునువినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ జిల్లా నాయకులు డాక్టర్ బండారు కుశలయ్య, రేపాల మధుసూదన్ రేపాల అంతయ్య, గార్లపాటి ధనమలయ్య తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

మరిన్ని వార్తలు