Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లా

India book of the record : 30 సెకండ్ల లో 34 ప్రశ్నలకు సమాధానాలు.. ఇండియా బుక్ ఆఫ్ ది రికార్డులో స్థానం..!

India book of the record : 30 సెకండ్ల లో 34 ప్రశ్నలకు సమాధానాలు.. ఇండియా బుక్ ఆఫ్ ది రికార్డులో స్థానం..!

శాయంపేట సెప్టెంబర్ 26 మన సాక్షి

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లో పత్తిపాక గ్రామంచెందిన పులిమాటి దివ్య ఓంకార్ దంపతుల కుమార్తెలు అయినా పులిమాటి సాగ్నిక మరియు నిశ్వికలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు.

పోయిన సంవత్సరం ఇదే ఓంకార్ దివ్య దంపతుల పెద్ద కుమార్తె సాగ్నికాకు ఆవర్తన పట్టిక లోనే 118 మూలకాలు 30 సెకండ్లలో చెప్పడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, కలాం వరల్డ్ రికార్డ్, జాకీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చాయి.

ALSO READ : TS TET : టెట్ ఫలితాలకు అంతా సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే..!

దేశంలోని రాష్ట్రాలు రాజధానుల పేర్లు 20 సెకండ్లలో చెప్పడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, 60 సెకండ్లలో 38 అబ్రివేషన్స్ చెప్పడం ద్వారా ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డ్, ఇలా ఆరు రికార్డులు వచ్చాయి. ఈ సంవత్సరంలో బ్రాంచెస్ ఆఫ్ స్టడీస్ ని 30 సెకండ్లలో 34 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది.

ALSO READ : KTR : తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ.. రావాలంటే క్షమాపణ చెప్పాల్సిందే..!

చిన్న పాప నిశ్విక స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ 35 సెకండ్లలో మరియు వెజిటబుల్స్ అనిమల్స్ కలర్స్ ఇండోర్ గేమ్స్ యాక్షన్స్ రైమ్స్ ఇలా 12 రకాల కేటగిరీలలో కలిపి చెప్పడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది.

పెద్ద పాప వయసు ఏడున్నర సంవత్సరాలు మరియు చిన్న పాప వయస్సు రెండున్నర సంవత్సరాలు వారి ఈరోజు శాలువాతో సన్మానం చెయిసిన తెలంగాణ రాష్ట్ర బిజెపిఅధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట జిల్లా నాయకులు మండల నాయకుల తదితరులున్నారు.

ALSO READ : Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు