Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Crime News : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

Crime News : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

మనసాక్షి , అమరావతి :

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను.. భర్త గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు.. జుజ్జూరు గ్రామంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తుండగా భార్యను గొడ్డలితో భర్త నరికి హత్య చేశాడు. జుజ్జూరు గ్రామానికి చెందిన మేడి వెంకటేశ్వరరావు, నళిని భార్యాభర్తలు . వీరిద్దరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భార్య నళిని మెడపై గొడ్డలితో నరికి భర్త హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే హత్యకు వివాహేతర సంబంధం కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

Train Derails Video : ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. ఇంజన్ క్యాబిన్ లో సీసీ కెమెరా దృశ్యాలు..!

హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!

Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు