Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Kcr Twist : కెసిఆర్ బిగ్ ట్విస్ట్.. బీ ఫామ్ లు వారికేనా, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..!

Kcr Twist : కెసిఆర్ బిగ్ ట్విస్ట్.. బీ ఫామ్ లు వారికేనా, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..!

హైదరాబాద్ , మన సాక్షి :

ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో బి ఫామ్ లు కొందరికి సిద్ధమైనట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. దాంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ ట్విస్టుతో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందా..? అని ఆందోళన చెందుతున్నారు .

అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 115 మందికి టికెట్లు ఇస్తున్నట్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకరు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ కేటాయించినప్పటికీ కూడా పార్టీ నుంచి వెళ్లిపోగా 114 మందిలో అందరికీ బి ఫామ్ లో ఇస్తున్నారా..? లేదా..? అనేది ట్విస్ట్ గా మారింది. ప్రస్తుతం కేవలం 51 మందికి మాత్రమే బీఫాంస్ మాత్రమే సిద్ధంగా ఉన్నాయని మిగతా వారికి సిద్ధమవుతాయని కేసీఆర్ పేర్కొన్నారు.

బీఫాంలు సిద్ధం కాలేదని కెసిఆర్ చెప్పడాన్ని నమ్మే విధంగా లేదని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 21వ తేదీన టిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికీ సుమారు 50 రోజులు గడిచింది. అయినా కూడా బీఫాంలో సిద్ధం కాలేదు అనటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ, ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడానికి అన్ని సిద్ధం చేసుకున్న పార్టీ, అభ్యర్థుల పేర్లు ప్రకటించి కూడా 50 రోజులు గడిచినప్పటికీ బీఫాంలు సిద్ధం కావడం లేదనడంలో సందేహం వ్యక్తం చేస్తున్నారు

 

ALSO READ : Congress First List : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఇవీ పేర్లు..!

పార్టీలు అసంతృప్తులు బయటికి వెళ్లకుండా కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా..? అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా టికెట్లు కేటాయించిన పలువురు ఎమ్మెల్యేల పై ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని తెలియడం వల్ల బి ఫామ్ లు ఆపారా..? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

బీఫాంలు వస్తున్నాయని సమావేశానికి అందరూ అభ్యర్థులు వచ్చారు. కానీ కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లు సిద్ధంగా ఉన్నాయని చెప్పడంతో తీవ్ర ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు. బీ ఫామ్ లు రాని అభ్యర్థుల స్థానాల్లో మార్పు ఉంటుందా..? అని ఆందోళన చెందుతున్నారు.

ALSO READ : Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 55 మంది జాబితాను వెల్లడించడం.. టిఆర్ఎస్ కేవలం 51 మందికి మాత్రమే బీఫాంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పడం.. బీఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తుంది.

మరిన్ని వార్తలు