Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయంహైదరాబాద్

Rythu Bandhu : రైతుబంధు పై రాద్ధాంతం..!

Rythu Bandhu : రైతుబంధు పై రాద్ధాంతం..!

రైతుబంధు , దళిత బంధు ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందంటూ బీఆర్ఎస్

నవంబర్ 2వ తేదీలోగా నిధులు విడుదల చేయాలని కోరినమంటూ కాంగ్రెస్

బీఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మద్య విమర్శలు

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతుబంధు, దళిత బంధు పథకాలపై ఎన్నికలవేళ రాద్ధాంతం కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ లో భాగంగా దళిత బంధు, రైతుబంధు పథకాలను ఆపాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని బీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు.

కాగా రైతుబంధు, దళిత బంధు పథకాలను ఆపాలని కాదంటూ నవంబర్ రెండవ తేదీలోగా నిధులు విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. నవంబర్ 2వ తేదీలోగా నిధులు విడుదల చేయకుంటే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక నిధులు విడుదల చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

ALSO READ : ఫ్లోరైడ్ ను తరిమి కొట్టాము.. మునుగోడు చైతన్యం చూపాలి.. పనికిమాలిన వాళ్లు కాంగ్రెస్ వాళ్లు..!

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని దళిత బంధు ఆపాలంటున్నారంటూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు అమలు చేయరని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా తాము రైతుబంధు ఏనాడు ఆపమని చెప్పలేదని కోడ్ లో భాగంగా నవంబర్ 2వ తేదీ లోగానే నిధులు విడుదల చేయాలని కోరినట్లు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిధులు విడుదల చేయలేకనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు.

ఎన్నికల కోడ్ లో సంక్షేమ పథకాలు ఆగుతాయా..?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల కోడ్ లో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయా..? లేదా..? కోడ్ లో భాగంగా వాటిని ఎన్నికల వరకు నిలిపివేస్తారా..? అనే అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : Congress Big Plan : కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్, కేటీఆర్ పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఎవరెవరు ఎక్కడంటే..?

కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు ఆపమంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆపుతుందా..? ఎన్నికల నిబంధనలు మేరకు ఆపుతుందా..? అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీ అంశమైంది. ప్రతి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టరనే విషయం ప్రజలకు తెలిసిన విషయమే. అయినప్పటికీ కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వత్ర చర్చనీ అంశంగా మారింది.

మరిన్ని వార్తలు