Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

IT Attacks : తెలంగాణలో ఎన్నికలవేళ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతల్లో కలకలం..!

IT Attacks : తెలంగాణలో ఎన్నికలవేళ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతల్లో కలకలం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ఎన్నికల వేళ ఐటి దాడుల కలకలం రేపింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు బిజీ.. బిజీగా.. ఉన్నారు. కాగా ఐటీ దాడుల కలకలం ఒకసారిగా ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న నేత ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ కేంద్రంగా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారితో పాటు అభ్యర్థుల ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన కే ఎల్ ఆర్ (కిచెన్నగారి లక్ష్మారెడ్డి) నివాసం తో పాటు ఆయన కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

దాంతో పాటు బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. కేఎల్ఆర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.

ALSO READ : Medigadda : మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. బ్యారేజీ సందర్శించిన రాహుల్..!

బాలాపూర్ లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశావాహులు, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. పారిజాత కుమార్తె ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పారిజాత నరసింహారెడ్డి తిరుపతిలో , ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. వీరు మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు.

ఏది ఏమైనా ఎన్నికల సమయంలో ఐటి దాడులు అభ్యర్థుల గుండెల్లో కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటి దాడులు నిర్వహిస్తున్నారా..? అన్ని పార్టీల అభ్యర్థులపై దాడులు నిర్వహిస్తారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ దాడులపై ఆయన స్పందించే అవకాశం ఉంది.

ALSO READ : BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!

మరిన్ని వార్తలు