Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్

Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈనెల (నవంబర్) 30వ తేదీన పోలింగ్ జరగనున్నది. పోలింగ్ రోజే ఎన్నికలకు అత్యంత కీలకమైన రోజు. ఐదు సంవత్సరాల పాటు మనల్ని ఎవరు పరిపాలించాలో డిసైడ్ చేసే రోజే అది. మనం వేసే ఓటు ఎవరికి వేసాము.. వారికి పడిందో..? లేదో..? వేయాలనుకున్న పార్టీకి వేసామో..? లేదో..? మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది.

అందుకోసం వివి ప్యాడ్ (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రం ఉంటుందని అందరికీ తెలుసు. మనం ఓటు వేశాక ఎవరికి ఓటు వేసింది స్లిప్ చూపిస్తుంది కదా.. అయితే ఆ స్లిప్పు ఎక్కువసేపు కనిపించదు.. కేవలం 7 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. ఆ తక్కువ టైంలోనే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.

స్లిప్ లో ఏం చూపిస్తుందంటే :

అయితే ఆ స్లిప్ లో ఏం చూపిస్తుందంటే అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, అతని గుర్తు చూపిస్తుంది. అందువల్ల ఓటు వేసే గదిలో లైటింగ్ బాగా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకు ఆ స్లిప్ బాగా కనిపిస్తుంది. మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చీకటిగా ఉంటే లైట్ వేయమని అడగండి.

ALSO READ : సూర్యాపేట  : మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద అవినీతి తిమింగలం.. వట్టె జానయ్య యాదవ్ 

ఓటు వేయగానే కుయ్యమని బీప్ శబ్దం వస్తుంది. అది రాగానే మనం వెంటనే పక్కనే ఉన్న వివి ప్లాట్ వైపు చూడాల్సి ఉంటుంది. అందులో స్లిప్పు వచ్చి కనిపిస్తుంది. ఏడు సెకండ్ల తర్వాత అది కింద ఉన్న డ్రా బాక్స్ లో పడిపోతుంది. ఆ స్లిప్ ని మనం తీసుకునే వీలు ఉండదు. కాబట్టి అక్కడే చూసుకోవాల్సి ఉంటుంది.

స్లిప్ ఎందుకు ఉంటుంది :

మరి స్లిప్ ఎందుకు ఉంటుంది. మనం వేసిన ఓటు పడిందో..? లేదో..? అనే డౌట్ కూడా మనకు ఉంటుంది. గతంలో తమ ఓటు పడలేదని, తమ బదులు వేరే వారు ఓటు వేశారని, చాలామందికి అనుమానం ఉండేది. చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేశారు. దాంతో 2013 నుంచి ఈ వివి ప్యాట్ లను రంగంలోకి దించారు. వీటివల్ల ఓటు పడింది అనే క్లారిటీ కూడా వస్తుంది.

ALSO READ : డ్రామారావు డైరెక్షన్ అంటే ఇట్లనే ఉంటది.. ట్విట్టర్ లో పోస్ట్..!

మరిన్ని వార్తలు