సూర్యాపేట  : మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద అవినీతి తిమింగలం.. వట్టె జానయ్య యాదవ్ 

కెసిఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొట్టి జాన యాదవ్ అన్నారు, ఆదివారం సూర్యాపేట పట్టణంలో ని సుమంగళి ఫంక్షన్ హాల్ నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్టీ సభకు సూర్యాపేట ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు.

సూర్యాపేట  : మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద అవినీతి తిమింగలం.. వట్టె జానయ్య యాదవ్ 

సూర్యాపేట , మనసాక్షి

కెసిఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె  జానయ్య యాదవ్ అన్నారు, ఆదివారం సూర్యాపేట పట్టణంలో ని సుమంగళి ఫంక్షన్ హాల్ నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్టీ సభకు సూర్యాపేట ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు.

వారిని ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 4.4 మిలియన్ ఉన్న ముస్లిం మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు.
12 % రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మోసం చేశారని తెలిపారు.

ప్రతి కుటుంబానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం మైనారిటీ లోన్ లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని తెలిపారు. ఒక్క మైనారిటీ సోదరునికి కూడా ఉద్యోగం రాలేదని దానికి కారణం బి ఆర్ ఎస్ పార్టీ అని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద అవినీతి తిమింగలం అని తెలిపారు.

ALSO READ : డ్రామారావు డైరెక్షన్ అంటే ఇట్లనే ఉంటది.. ట్విట్టర్ లో పోస్ట్..!

సూర్యాపేటలో అభివృద్ధి పేరుతో 9 సంవత్సరాల లో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట మైనారిటీ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఒక్కరోజులోనే 75 కేసులు పెట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల్లో బహుజన బిడ్డని ఆశీర్వదించాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో చాంద్ పాషా బి ఎస్ పి జిల్లా మైనారిటీ అధ్యక్షులు, ఎండి యూసుఫ్ పిల్లలమర్రి, అఫ్జల్, మహమ్మద్ జమ్మిగడ్డ, షఫీ , మౌలానా మౌలి సాబ్ గాజుల మల్కాపురం, ఖాసిం ఖాసింపేట, ఫైజల్, మోబిన్, అలీ భాయ్, మహమూద్ భాయ్, షకీల్ భాయ్, మైనారిటీ సంఘం సభ్యులు మహిళలు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : సగం కాలి పడి ఉన్న మహిళ మృతదేహం..!