నక్కల గండి, డిండి ఎత్తిపోతల పూర్తి చేయలేని బి ఆర్ ఎస్ ను ఓడించండి.. బాలు నాయక్..!
నక్కల గండి, డిండి ఎత్తిపోతల పూర్తి చేయలేని బి ఆర్ ఎస్ ను ఓడించండి.. బాలు నాయక్..!
ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలుగా మారాయి.
చింతపల్లి. మన సాక్షి.
నల్లమల అటవీ విప్రాంతంలో భాగమైన దేవరకొండ నియోజకవర్గం సాగునీటి సమస్యతో గిరిజనులు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనావత్ బాలునాయక్ అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నక్కల గండి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను స్వయంగా తానే కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలుగా మారాయి. తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారన్నారు.
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని రాష్ట్రంలో ఒక కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మారిందన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి ప్రాజెక్టు కోసం నిధులు వెచ్చించలేని బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. తాను ప్రజల కోసమే జన్మించానని సామాన్య ప్రజలే “నా బలం బలగం ” అన్నారు. ప్రతి గ్రామంలో మీరు నాపై చూపే ప్రేమాభిమానమే నన్ను నేను ఒక్కడిని చేశాయన్నారు.
ALSO READ : 39 wives in one place : 39 మంది భార్యలు.. ఒకేచోట కాపురం, కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే..!
మీరందరూ ఆశీర్వదిస్తే ప్రజా సేవ చేసేందుకు తన ప్రాణాలైనా అర్పిస్తానన్నారు. ప్రభుత్వ ఆ సైన్డ్ భూములను ఆక్రమించుకొని అధికారం చలాయిస్తున్న నాయకుని కి రేపు 30 తారీఖున ఓటు వేసే ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి అవినీతి నాయకులు తిన్న ప్రభుత్వ సొమ్మును కకిస్తామన్నారు.
మన రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప మరో ప్రభుత్వం రాబోతున్నారు. ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలన్నారు.. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు జాలే నరసింహారెడ్డి, వడ్త్యా దేవేందర్ నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి, ఆలంపల్లి నరసింహ,పున్న వెంకటేశ్వర్లు, పొన్నబోయిన సైదులు, నీతో పాటు పలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









