Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. సొంతగూటికి చేరిన అలుగుబెల్లి, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక..!

మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. సొంతగూటికి చేరిన అలుగుబెల్లి, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక..!

హైదరాబాద్ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాదులోని మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ లో కొనసాగిన అమరేందర్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేదు.

ALSO READ : మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

అంతేకాకుండా 2023లో కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతర పరిణామాల దృష్ట్యా అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి సొంతగూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయన వెంట మిర్యాలగూడ టిఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి తదితరులు ఉన్నారు.

ALSO READ : సూర్యాపేట : హై టెన్షన్ నడుమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. ఎవరికి మద్దతు అంటే..!

మరిన్ని వార్తలు