నిరుద్యోగలను మోసం చేసిన సీఎం కేసీఆర్,,!
నిరుద్యోగలను మోసం చేసిన సీఎం కేసీఆర్,,!
నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న
సూర్యాపేట , మన సాక్షి:
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఈనెల 20వ తేదీన జిల్లా కేంద్రానికి చేరుకుంటున్న నిరుద్యోగ చైతన్య ప్రజాయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో విద్యార్థులకు నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన పేపర్ లీకేజీల పేరుతో పరీక్షలను రద్దు చేశారని, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ : 39 wives in one place : 39 మంది భార్యలు.. ఒకేచోట కాపురం, కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే..!
టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామని స్పష్టం చేశారు.బిఆర్ఎస్ ఓటమి నిరుద్యోగుల అంతిమ లక్ష్యమని తెలిపారు. నిరుద్యోగులలో చైతన్యం తీసుకురావడానికి ఫ్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ హర గోపాల్, విశ్వేశ్వరయ్య,రియాజ్, జనార్ధన్ నేతృత్వంలో ఈనెల 15వ తారీకున గన్ పార్క్ నుండి నిరుద్యోగ చైతన్య ప్రజాయాత్ర తెలంగాణలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ లో రెండువైపుల నిరుద్యోగ యువతను చైతన్య పరుస్తున్నారని తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో 50వేల మంది నిరుద్యోగ యువత ఉన్నారని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీకాంత్,శ్రీను,శేఖర్, సంపత్, మహేష్, ఉపేందర్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!









