BREAKING : అయోమయంలో అన్నదాతలు..!
BREAKING : అయోమయంలో అన్నదాతలు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం తడ్కల్ మండలం కేంద్రంలో అకాల వర్షంతో ఐకెపి కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దాయింది. రోడ్లపై ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
అధికారుల స్పందించి తడిచిన వడ్లను కొనుగోలు చేయాలనీ అంటున్నారు. రాత్రి పడ్డ భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది.
ALSO READ : Political News : తెలంగాణ ఆ పార్టీకి పేటెంటా.. పార్టీ పేరులోనే తెలంగాణ పదం తొలగించిన వారికా, మరి ఎవరికి..!
దీంతో రైతులు నెత్తికి చేతులు పెట్టి బోర్ మంటున్నా రైతన్నలు. అరుగాలం కష్టం చేసి ధాన్యం తమ కళ్ల ముందు తడిసిపోయినా వైనాన్ని చూసి రైతులు బాధ పడటం జరుగుతుంది అని అంటున్నారు.
ఐకెపి కేంద్రాలలో దాన్యం మీద కప్పుకునే పట్టాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. పట్టాలు ఉంటే రైతులకు మేలు జరిగేది కానీ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ALSO READ : పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్.. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం..!









