Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!

BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!
మర్రిగూడ, మన సాక్షి:
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల తిరగండ్లపల్లి గ్రామం చైన్ స్నాచింగ్ కేసులో నిందితులు పోలీసులకు చిక్కారు. అయితే విచారణలో నిందితులిద్దరూ భార్యాభర్తగా గుర్తించారు.

అయితే నిందితుడి వెంకటేష్ స్వగ్రామం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ పాలెం తండగా గుర్తించారు, ప్రస్తుతం హైదరాబాద్ సంతోష్ నగర్‌ లో నివాసముంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు అవుతుందని, జలసాలకు అలవాటు పడే ఈ దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తుంది, నిందితుడు వెంకటేష్ పై మరి ఏమైనా కేసులు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ALSO READ : BREAKING : చంద్రబాబుతో షర్మిల భేటీ.. అనంతరం కీలక వ్యాఖ్యలు..!

ఇదే మొదటి దొంగతనమా లేక ఇదే తరహాలో మరి ఎక్కడైనా ఏమైనా నేరాలు చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది, దొంగతనం చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి చైన్ స్నాచర్లు మార్చుకున్నట్లు విచారణలో తేలింది. అయితే నిన్న చాట సునిత మహిళను లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుని కళ్లలో కారం చల్లి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి కండ్లు కారం కుట్టిన తొందరగా తేరుకొని తన పక్కింటి వాళ్లకు ఫోను చేయడంతో, వాళ్లు కొద్ది దూరము బైకుపై వెంబడించారు బండిలో పెట్రోల్ అయిపోవడం వల్ల నిందితులను పట్టుకోలేక పోయారు, నిందితుని గుర్తించడంలో సీసీ కెమెరాల కీలకమయ్యాయి, సీసీ కెమెరా ఫోటో ఆధారంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం వలన నిందితుని పట్టుకోవడం తేలికైంది.

ALSO READ : Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ 500 ఫైన్..!

కొసమెరుపు ఏందంటే బాధితురాలి కొడుకు స్నేహితుని ఇంటి పక్కనే ఈ నిందితుడు ఉండడంతో స్నేహితులు గుర్తించి బాధితురాలు కొడుకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది, ఈ సమాచారం తోనే నేరస్థున్ని తొందరగా గుర్తించినట్లు తెలుస్తుంది ,

మరిన్ని వార్తలు