Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

BREAKING : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు..!

BREAKING : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు..!

శ్రీకాకుళం , మన సాక్షి:

ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఆమెతోపాటు రఘువీరారెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ఆమె ఇచ్ఛాపురం YSR పైలాన్ వద్ద నివాళులు అఅర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై జగన్ కొట్టడం లేదని పేర్కొన్నారు. YSR ప్రజా ప్రస్థానం ముగింపు ఇదే ఇచ్ఛాపురం.ప్రజల కష్టాలు చూశామని చెప్పారు, ఒక్క అవకాశం అని అడిగారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచే పుట్టినవే అరోగ్య శ్రీ,రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, పక్కా ఇళ్లు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారు.

ALSO READ : BIG BREAKING : ఇప్పటినుంచి జగన్ ను అలాగే పిలుస్తా.. షర్మిల సంచలన ప్రకటన..!

YSR పోరాటానికి కొనసాగింపు గా పేదల పక్షాన నిలబడేందుకు ఇదే ఇచ్ఛాపురం ఎంచుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెలుకోసం ఇదే ఇచ్ఛాపురం నుంచి నా ప్రస్థానం మొదలయ్యింది. నా ప్రస్థానాన్ని ప్రజలు ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీ నుంచే YSR అన్ని పథకాలు అమలు చేశారు.  YSR కి కాంగ్రెస్ ఎంత భలమో…కాంగ్రెస్ కి YSR అంతే భలం.. YSR ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శ చేస్తున్నారు. వాళ్ళు చేసే విమర్శల్లో నిజాలు లేవు.  YSR అంటే కాంగ్రెస్ కి ఇప్పటికీ అభిమానం ఉంది.

సోనియా గాంధీ గారు నాకు స్వయంగా చెప్పారు. రాజీవ్ చనిపోయాక కూడా FIR లో పేరు పెట్టారు..తెలియక చేసిన తప్పు కానీ…తెలిసి చేసింది కాదు.  YSR బ్రతికి ఉన్నంత కాలం బీజేపీ కి వ్యతిరేకి. ఇవ్వాళ AP లో చూస్తే చాలా భాధగా ఉంది. బీజేపీ కి ఇక్కడ పార్టీలు తొత్తులుగా,బానిసలు గా మారారు.

బీజేపీ కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు…కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. జగన్ ఆన్న గారు ప్రభుత్వం బీజేపీ కి కీలుబొమ్మ లా మారింది. బీజేపీ కి ఊడిగం చేస్తున్నారు. 25MP లు, 6 మంది రాజ్యసభ ఎంపీలు అందరూ బీజేపీ చెప్పు చేతుల్లోనే . ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ కి ఓటు వేయలేదు ..కానీ పార్టీలు మాత్రం బీజేపీ పంచన చేరాయి.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!

బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది. జగన్ ఆన్న గారు ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజు అడగలేదు.. 25 మంది ఎంపీలు ఇస్తే హోదా తెస్తా ఆన్న మీ మాటలు ఎక్కడ పోయాయి.  రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతా అన్నారు.  ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ.. అందరం కలిసి YSR ఆశయాలను బ్రతికిద్ధం.

మరిన్ని వార్తలు