BREAKING : తొలి అభ్యర్థిని ప్రకటించిన షర్మిల.. బ్రిటిష్ వాళ్లను అల్లూరి తరిమి కొట్టినట్లు ఇప్పుడు నియంతలను తరిమికొట్టండి
BREAKING : తొలి అభ్యర్థిని ప్రకటించిన షర్మిల.. బ్రిటిష్ వాళ్లను అల్లూరి తరిమి కొట్టినట్లు ఇప్పుడు నియంతలను తరిమికొట్టండి
చింతపల్లి లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ
సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మొదటి అభ్యర్థిని ప్రకటించిన APCC చీఫ్ షర్మిలా రెడ్డి
పాడేరు అభ్యర్థిగా వంతల సుబ్బారావు పేరు ప్రకటించిన వైఎస్ షర్మిల రెడ్డి
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్ షర్మిల రెడ్డి అభ్యర్థిని ప్రకటించారు. ఆమె నిర్వహించిన పాడేరు బహిరంగ సభలోనే అభ్యర్థిని ప్రకటించారు . అదేవిధంగా నాడు బ్రిటిష్ వాళ్ళను అల్లూరి సీతారామరాజు తరిమికొట్టినట్లుగానే ఇప్పుడు నియంతలను తరిమికొట్టాలని ఘాటుగా పిలుపునిచ్చారు.
ఆమె మాట్లాడిన మాటలు యధావిధిగా
బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టిన వీరుడు మన్యం దొర అల్లూరి సీతారామరాజు
– ఆయన మీకు మాకు స్ఫూర్తి
– ఆయన పౌరుషం మనకు ఆదర్శం
– ఆ రక్తం మీలో ఉంది.
– అల్లూరి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టినట్లు…ఇప్పుడు నియంతలను కూడా తరిమి కొట్టండి
– ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం మనకు వద్దు…ఈ ప్రతిపక్షం మనకు వద్దు
ఆదివాసీలు అంటే YSR కి ఎంతో అభిమానం
వైఎస్సార్ హయాంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు
– పాస్ బుక్ లు ఇచ్చి…లోన్లు ఇచ్చారు…
– సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు
– ఐటీడీఏ పరిధిలో కేంద్రం నుంచి వచ్చిన 3 వేల కోట్లు ప్రతి పైసా ఖర్చు చేశారు
– గిరిజన ప్రాంతాల్లో రోడ్లు,కాలేజీలు,ఆసుపత్రులు అన్ని కట్టించారు
– వైఎస్సార్ వేసిన రోడ్లే ఇవ్వాళ్టి కి దిక్కు
– ఇప్పటి ప్రభుత్వాలకు గిరిజనుల అభివృద్ధి మీద పట్టింపు లేదు
– రోడ్లు లేక గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు
– ఇప్పటి ప్రభుత్వాలకు బాక్సైట్ తవ్వకాల మీద శ్రద్ధ గిరిజనుల అభివృద్ధి మీద లేదు
– బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు
– గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కనీసం త్రాగునీటి సౌకర్యం లేదు
– గిరిజన యువకులకు అసలు ఉద్యోగాలు లేవు…
– లక్షల మంది గిరిజన బిడ్డలకు ప్రభుత్వాలు అన్యాయం చేశాయి
– జీఓ 3 రద్దుతో ఆదివాసీల హక్కులు హరించ బడ్డాయి
– వారి ఉద్యోగాలు వారికి రాకుండా పోయాయి
– కాంగ్రెస్ అధికారంలో వచ్చాక జీఓ 3 నీ అమలు చేస్తాం
– సుప్రీం కోర్టు వరకు వెళ్లి గిరిజనుల పక్షాన పోరాడుదాం
– 1/70 యాక్ట్ విషయంలో గిరిజనుల పక్షాన మా పోరాటం ఉంటుంది
– ప్రత్యేక హోదా వచ్చి ఉంటే… మన గిరిజన ప్రాంతాలు బాగుపడేవి
– జగన్ ఆన్న 25 ఎంపీ లు ఇస్తే హోదా తెస్తాం అన్నారు
– అధికారంలో వచ్చాక ఒక్క ఉద్యమం లేదు..
– హోదా తేవడం చేతకలేదు కానీ… సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు
– మన రాష్ట్రానికి హోదా రావాలి
– హోదా తేవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది
– రాహుల్ గాంధీ మాట ఇచ్చారు.
ALSO READ: BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!









