Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

BREAKING : సబ్ స్టేషన్ లో భారీ మంటలు.. అంధకారంలో సిద్దిపేట..!

BREAKING : సబ్ స్టేషన్ లో భారీ మంటలు.. అంధకారంలో సిద్దిపేట..!

దుబ్బాక, మనసాక్షి :

జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న సబ్ స్టేషన్ లో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు భారీ మంటలు చెరువేగాయి. సబ్ స్టేషన్ లో ప్రమాదం బాధాకరం మంటలను వేగంగా ఆర్పాలి మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలు అర్పడానికి ఆదేశం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట పట్టణంలోని

220/132/33 సబ్ స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది.. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంటలు త్వరగా అర్పించడానికి మున్సిపల్, పోలీసు, అగ్నిమాపక అధికారులతో మాట్లాడారు. సంఘటనా స్థలంలోనే ఉండి మంటలు అర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా లోని అగ్నిమాపక కేంద్రాల నుండి ఫైర్ ఇంజన్ లను తెప్పిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో వాటర్ ట్యాంకర్ లను తెప్పించారు.

మరిన్ని వార్తలు