Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Getting Used to Jalsa : జల్సాలకు అలవాటు పడి.. జైలుకు..!

Getting Used to Jalsa : జల్సాలకు అలవాటు పడి.. జైలుకు..!

అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు

దుబ్బాక, మనసాక్షి :

ఇటీవల దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తాలో ఇండియా వన్ ఏటీఎం లో చోరీ కి ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే.. గురువారం నేరస్తులను గుర్తించి అరెస్టు చేసినట్లు దుబ్బాక సిఐ శ్రీనివాస్, గంగరాజు తెలిపారు.

వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, గుర్రాల అనిల్ ఇద్దరు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని లక్ష్యంతో దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డారు.

అదే క్రమంలో ఈ నెల 19న రాత్రి సమయంలో ఏటీఎంలో దొంగతనం చేయాలని తమ వెంట తెచ్చుకున్న గడ్డపారతో ఏటీఎం ను పగలగొట్టి నగదు తీసేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో షబ్దానికి ఇరుగు పొరుగువారు లేవగా అక్కడ నుండి పారిపోయారు. నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు