Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణసంక్షేమం

Zero bills for home electricity : గృహ విద్యుత్ కు ఇక జీరో బిల్లులు, ఎప్పటినుంచంటే.. ఆదేశించిన రేవంత్ రెడ్డి..!

Zero bills for home electricity : గృహ విద్యుత్ కు ఇక జీరో బిల్లులు, ఎప్పటినుంచంటే.. ఆదేశించిన రేవంత్ రెడ్డి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాల జోరు సాగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రిమండలి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలను వేగవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించే మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచే పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు.

అదేవిధంగా మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అనుసరించాల్సిన విధి విధానాలపై ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ, అధికారులతో గురువారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

ALSO READ : Telangana : కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్..!

సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. గృహ జ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దానిని అమలు చేసేందుకు పూర్తి సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని అధికారులకు సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజా పాలన దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు లబ్ధి పొందేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా ..? ఏజెన్సీలకు చెల్లించాలా? అనే అంశాన్ని అధికారులతో చర్చించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయాలా..? ఏజెన్సీలకు చెల్లించాలా..? దానికి సంబంధించిన అడ్డంకులను అధికారులతో చర్చించారు.

ALSO READ : Drinking water : తాగు నీటి స‌ర‌ఫ‌రాకే తొలి ప్రాధాన్యం..!

ఏది ఏమైనా లబ్ధిదారులకు మాత్రం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించాలని సూచించారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ కూడా గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లులు జారీ చేసే సమయంలో అర్హులకు గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

దరఖాస్తులలో సవరణ :

ప్రజాపాలన దరఖాస్తులలో తప్పులు ఉన్నట్లయితే సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. కార్డు నెంబర్లు , కనెక్షన్ నెంబర్లు తప్పుల కారణంగా జీరో బిల్లులకు అర్హత కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే సవరించే విధంగా అవకాశం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ బిల్లు కలెక్షన్ సెంటర్లు సర్వీస్ సెంటర్లలో ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని పేర్కొన్నారు.

అందుకు సంబంధించిన ప్రతి గ్రామంలోనూ ప్రజలకు తెలిసేలా విద్యుత్ అధికారులు ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలన్నారు. తప్పులను సవరించుకున్న అర్హులకు తదుపరి నెలనుంచి ఈ పథకం వర్తింపజేసేలా చూడాలన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఉంటే ఎంపీడీవో , తాసిల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కొనసాగించాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అధికారులకు ఆదేశించారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లై కమిషనర్ డి.ఎస్ చౌహన్, ట్రాన్స్కో జెన్కో సిఎండి రిజ్వి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..!

మరిన్ని వార్తలు