Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు
దమ్మపేట రూరల్, మన సాక్షి :
చండ్రుగొండ మండలం ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా, మానసికంగా లొంగదీసుకొని పెళ్లికి నిరాకరించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వెంకటియాతండాకు చెందిన ఓ యువతిని జర్పులాతండాకు చెందిన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమపేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిపై ఒత్తిడి తేవడంతో యువకుడు మరొకరిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లి చూపులకు వెళ్తున్నాడు అని తెలుసుకున్న యువతి. వివాహం చేసుకోడని తెలుసుకున్న యువతి అతడిపై శుక్రవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది.









