Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసంక్షేమం

Gas Cylinders : రూ.500 గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం మెలిక.. అందరికీ కష్టమే..!

Gas Cylinders : రూ.500 గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం మెలిక.. అందరికీ కష్టమే..!

మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తున్నారు. మరో రెండు గ్యారెంటీ హామీలను అమలు చేసేందుకు ఇటీవల మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు.

అంతేకాకుండా ఈనెల 27వ తేదీ నుంచి మరో రెండు గ్యారెంటీ హామీలు.. 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ తో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేసే పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమ్మక్క సారక్క సందర్శించుకున్న రేవంత్ రెడ్డి అక్కడే ప్రకటన చేశారు. 500 వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఈనెల 27వ తేదీ నుంచి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ తో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తును అందించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ రెండు పథకాలను అమలులోకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా ఉచిత గృహ విద్యుత్తు కోసం వినియోగదారుల వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల ఎంపికలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఉన్నారని తెలిసింది.

ఈ విషయాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తెల్ల రేషన్ కార్డు ఉంది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ సిలిండర్ అందే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ పేర్కొంటుంది. అర్హత ఉన్న కుటుంబం గత మూడు సంవత్సరాలలో వినియోగించిన గ్యాస్ సిలిండర్ల ఆధారంగా తుది జాబితాలో సిద్ధం చేసినట్లు సమాచారం.

మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ నేరుగా లబ్ధిదారులకు ఇవ్వరు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా రియంబర్స్మెంట్ రూపంలో లబ్ధి చేకూరేలా అందజేస్తారని సమాచారం.. ముందుగా గ్యాస్ సిలిండర్ కి మొత్తం సొమ్ము చెల్లిస్తే ఆ తర్వాత సబ్సిడీ రూపంలో మీరు ఎక్కువగా చెల్లించిన డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ కానున్నది.

ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 89.99 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు అంచనా వేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 39.50 లక్షల మందికి మాత్రమే 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ పథకాన్ని అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. అర్హులైన వినియోగదారులందరికీ 27 సాయంత్రం నుంచి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేస్తారు.

ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత అర్హుల జాబితా మరింతగా పెరిగే అవకాశం ఉంది. అర్హులైన వారందరికీ కూడా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ALSO READ : Zero bills for home electricity : గృహ విద్యుత్ కు ఇక జీరో బిల్లులు, ఎప్పటినుంచంటే.. ఆదేశించిన రేవంత్ రెడ్డి..!

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.

మరిన్ని వార్తలు